టాలీవుడ్ లో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాహుబలి తో వచ్చిన క్రేజ్ ప్రభాస్ అమాంతం క్రేజీని సంపాదించుకున్నారు. ఆ తర్వాత నటించిన చిత్రాలు అన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్-k, స్పిరిట్, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించబోతున్నారు. అయితే ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించారు. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నది.
ఈ చిత్రం ఇప్పటికీ 85% పూర్తి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ని ఈ చిత్రంలో డైరెక్టర్ ఎలా చూపించబోతున్నారనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఈ సినిమాని విడుదల చేయాలని పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సైతం ఇప్పటివరకు అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక గత ఏడాది కూడా ఈ సినిమా నుంచి లీకైన వీడియోలు ఫోటోలు కూడా అభిమానులను ఖుషి చేశాయని చెప్పవచ్చు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి లీకైన ఫొటోస్ ప్రభాస్ చాలా హైలెట్ గా కనిపిస్తూ ఉన్నారు.ఈ ఫోటోలలో ప్రభాస్ ని చూస్తూ ఉంటే ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయి అంటూ పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఇలాంటివి మళ్లీ లీక్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలంటే చిత్ర బృందానికి సూచనలు ఇస్తున్నారు అభిమానులు. ఈ సినిమాని హోమ్ బలే ఫిలిం బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీడియో ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: