రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శించాలి అంటే వెంటనే అతడి మూడు పెళ్ళిళ్ళ విషయాన్ని గుర్తుకు చేస్తూ అతడి పై సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే విషయమై ‘ఆహా’ లో త్వరలో ప్రసారం కాబోతున్న ‘అన్ ష్టాపబుల్’ షోలో బాలకృష్ణ పవన్ నుండి ఒక క్లారిటీ తీసుకు రావడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.


‘ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అంటూ బాలకృష్ణ పవన్ కల్యాణ్ ను అడిగిన ప్రశ్నకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. దీనితో ఈఇంటర్వ్యూలో బాలయ్య పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాల సున్నితమైన ప్రశ్నలను అడిగినట్లు కనిపిస్తోంది. దీనితో ఈప్రశ్నకు పవన్ ఎటువంటి సమాధానం ఇచ్చాడు అన్న ఆశక్తి అందరిలోనూ పెరిగిపోతోంది. పవన్ ను ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదని తనదైన శైలిలో పొలిటికల్ గా సమాధానాలు చెప్పి చాకచక్యంగా తప్పించుకున్నాడని ఆషోకు స్క్రిప్ట్ అందిస్తున్న బీవీఎస్ రవి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా ఈషో షూటింగ్ కు రాగానే ‘అన్ ష్టాపబుల్’ టీమ్ ఈషోకు సంబంధించిన ప్రశ్నల స్క్రిప్ట్ ను పవన్ చేతికి ఇచ్చినప్పటికీ వాటిని తాను చూడవలసిన అవసరం లేదని బాలయ్య అడిగే ప్రశ్నలను బట్టి తనకు సమాధానం చెప్పే శక్తి ఉంది అని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈషోను సంక్రాంతి పండుగ సమయంలో ఆహా లో ప్రసారం అవుతుందని అంతా భావించారు. అయితే అది జరగలేదు. ఆతరువాత రిపబ్లిక్ డే కి స్ట్రీమ్ అవుతుంది అని భావించారు. అయితే అప్పుడు కూడ జరగలేదు.


ఇప్పుడు ఫిబ్రవరి మొదటివారంలో ఈషో ప్రసారం అవుతుంది అన్నవార్తలు వస్తున్నాయి. ఇలా ఈషోను ప్రసారం చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థంకాక పవన్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ బాలకృష్ణఎపిసోడ్ కు ఎక్కువ రేటింగ్స్ వచ్చే విధంగా చేయడానికి ఒక సరైన డేట్ కోసం ఆహా యాజమాన్యం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: