రజనీకాంత్ హవా కొద్దిగా తగ్గిన తరువాత తమిళ టాప్ హీరో స్థానానికి జరుగుతున్న పోటీలో విజయ్ అజిత్ లు ఒకరి పై ఒకరు పైచేయి సాధించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఈటాప్ హీరోల అభిమానుల మధ్య కొనసాగుతున్న వార్ వల్ల విజయ్ అజిత్ లు కేవలం తమిళ మీడియాకు మాత్రమే కాకుండా దక్షిణాది సినిమారంగంలో వీరిద్దరూ ఎప్పుడూ హాట్ న్యూస్ కు చిరునామాగా కొనసాగుతున్నారు.


ఈసంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదలైన విజయ్ అజిత్ ల సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఆరెండు సినిమాలకు తమిళనాడులో వచ్చిన మొదటి వారం కలక్షన్స్ ను చూసి వారి మ్యానియాకు దక్షిణాది సినిమా రంగం షాక్ అయింది. ఇక హీరో విజయ్ విషయానికి వస్తే అతడిని రాజకీయాలలోకి రమ్మంటూ అతడి అభిమానులు చేస్తున్న హడావిడితో తమిళనాడు హోరెత్తిపోతోంది.


లేటెస్ట్ గా విజయ్ నటించిన ‘వారసుడు’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీ కేవలం మూడు రోజులలో 100 కోట్లకు పైగా కలక్షన్స్ ను తెచ్చుకోవడంతో విజయ్ తో సినిమా తీయాలని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ్ ని కలవడమే కాకుండా అతడికి 150 కోట్ల పారితోషికం ఆఫర్ చేసింది అంటూ వస్తున్న వార్తలతో తమిళ మీడియా హోరెత్తిపోతోంది. ఇప్పుడు ఈవార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడ చేరడంతో తెలుగు టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న చాలామంది ప్రముఖ నిర్మాతలు భయపడుతున్నట్లు టాక్.


ఇప్పటికే చిరంజీవి పవన్ లు 50 కోట్ల పారితోషికపు రేంజ్ లో ఉంటే ‘పుష్ప’ సూపర్ హిట్ అయ్యాక ఆమూవీ సీక్వెల్ లో నటించడానికి అల్లు అర్జున్ 75కోట్ల పారితోషికాన్ని ఆమూవీ నిర్మాతల వద్ద బన్నీ డిమాండ్ చేసాడు అంటూ గాసిప్పులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే 50 కోట్ల రేంజ్ లో ఉన్న మహేష్ రామ్ చరణ్ జూనియర్ ప్రభాస్ లు విజయ్ పారితోషికం ఉదాహరణగా చూపెడుతూ వారు కూడ ఆ రేంజ్ లో పారితోషికాన్ని కోరుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతల పరిస్థితి ఏమిటి అంటూ కొందరు జోక్ చేస్తున్నట్లు టాక్..మరింత సమాచారం తెలుసుకోండి: