త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ మరో సినిమాను అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు. కొరటాల శివతో సినిమా ఉండబోతుందని చెప్పాడు. దీంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు వరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తారక్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలు మునిగిపోతూ ఉన్నారు. కొరటాల శివ స్క్రిప్ట్ కంప్లీట్ చేయకపోవడంతో ఈ సినిమా ఆలస్యం అవుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


 అయితే ఇటీవలే కొరటాల శివ స్క్రిప్ట్ ని పూర్తిగా కంప్లీట్ చేసి తారక్ కు వినిపించాడట కొరటాల. తారక్ కు కూడా ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఇక 2024 ఏప్రిల్ ఐదవ తేదీ లోపు ఈ సినిమా విడుదల చేస్తామని ఇటీవల అన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పాడు. ఇక మార్చి నుండి షూటింగ్ మొదలవుతుందని పండగ లాంటి వార్తా అభిమానులకు తెలియజేశాడు. దీంతో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే  సినిమా అప్డేట్ కోసం ఎదురుచూసిన అభిమానులు అందరూ కూడా ఈ అప్డేట్ తో సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ తో సినిమాకు ముందు కొరటాల శివ తన కెరియర్ లో మొదటి ఫెయిల్యూర్ను ఫేస్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడం.. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా చివరికి ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కొరటాల శివ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పు చేయకుండా మాస్టర్ మైండ్ ప్లాన్ వేశాడట కొరటాల శివ. తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఇక కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ అభిమానులు మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడని.. పవర్ పాక్డ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: