నందమూరి వారసుడుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈయన నటించిన సినిమా త్వరలోనే విడుదల అవ్వబోతోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఎల్లప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకొని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రయోగాత్మక సినిమాలను తీసే కళ్యాణ్ రామ్ చేస్తున్న మరో ప్రయోగం ఈ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు విడుదల చేశారు చిత్ర బృందం. 

విడుదల అనంతరం ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన ఈ సినిమా ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ఇక ఈ సినిమాలో కళ్యాణ్రామ్ ఏకంగా త్రిబుల్ రోల్లో నటించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక ఈ సినిమా డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి ఈ సినిమాని ఒక కొత్త రకమైన సబ్జెక్టుతో మరియు కమర్షియల్ ఫార్మేట్లో తెరగెక్కించాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు టీజర్ విడుదల అనంతరం ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం.గతేడాది కళ్యాణ్ రామ్ నటించిన బిబిసారా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ నేపథ్యంలోని బింబిసార సినిమాకి మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అంచుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదట విజయ దేవరకొండ తో చేద్దామని అనుకున్నారట. ఈ సినిమా డైరెక్టర్ రాజేందర్ రెడ్డిసినిమా విజయ్ దేవరకొండ కి వినిపించిన తర్వాత బాగుందని చెప్పాడట. కానీ అప్పటికే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం రెండు వేల పాటు డిప్స్ మొత్తం కూడా కేటాయించడంతో ఈ సినిమాని వదులుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలా మంది ఈ సినిమా కథ వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ సినిమాని చేసి ఉంటే పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపును పొందేవాడు.అనవసరంగా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నాడు అంటూ చాలామంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: