ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు చేసిన తప్పిదాలు కొంతమంది హీరోలను స్టార్ హీరోలుగా చేస్తాయి అనడానికి నిదర్శనం అల్లు అర్జున్ నితిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయం ఏంటంటే సాధారణంగా ఏ రంగంలోనైనా సరే ఒకరు చేసిన తప్పులు మరొకరికి వరాలు అవుతూ ఉంటాయి అని చెప్పాలి .ఎందుకంటే కొంతమంది వదులుకున్న పని మరొకరు చేసి చాలా సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక అలా వేరొకరు సక్సెస్ ను అందుకుంటే తర్వాత ఆ సక్సెస్ ని వదులుకున్న వారు చాలా బాధపడుతూ ఉంటారు.

 ఇక అలాంటి చిన్న చిన్న తప్పులే కొందరి జీవితాలను మార్చేస్తూ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే  అల్లు అర్జున్ కూడా ఇలానే స్టార్ హీరోగా టాలీవుడ్ లో తెలుగు లేకుండా చలామణి అవుతున్నాడు అని అంటున్నారు. అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో పరిచయమయ్యాడు. 2004లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో స్టార్ హీరో లిస్టులోకి చేరిపోయాడు అల్లు అర్జున్. దాని అనంతరం మళ్లీ తిరిగి వెనక్కి చూసుకోకుండా వర్షం సినిమాలో చేసుకుంటూ పోతున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరియర్కు గట్టి పునాది పడింది ఈ సినిమాలతోనే అని చెప్పాలి. ఇక ఈ సినిమాతోనే సుకుమార్ కూడా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

 ఆర్య సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ గా ఆర్య 2 కూడా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది. ఇక ఈ సినిమాకు ముందుగా హీరోగా బన్నీని అనుకోలేదు. నితిన్ ని ఈ సినిమాలో హీరోగా అనుకున్నారట. కానీ నితినప్పుడు జయం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమాలో హీరోయిన్గా సదా నటించిన తేజ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నితిన్ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక అదే సమయంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజం లో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. దీంతో దిల్ రాజు నితిన్ తో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో నితిన్ ఆరేడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆర్య 2 సినిమా చేసే ఛాన్స్ లేక తప్పని పరిస్థితుల్లో అల్లు అర్జున్ తోనే ఈ సినిమా చేయాల్సి వచ్చింది .అయితే ఆ సమయంలో నితిన్ గనుక ఆర్య 2 సినిమా చేసి ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ స్థానంలో నితిన్ ఉండేవాడు అని అంటున్నారు చాలామంది నేటిజన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: