కోలీవుడ్ హీరోలైన కార్తీ, శివ కార్తికేయన్ లకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ ఇద్దరి హీరోలకు మంచి మార్కెట్ ఉంది. ఈ ఇద్దరికీ రెండు భాషల్లో అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. గత ఏడాది దీపావళికి ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. కార్తీ సర్దార్ సినిమాతో వస్తే.. శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాతో సందడి చేశాడు. అయితే ఈ ఇద్దరు హీరోల్లో కార్తి నటించిన సర్దార్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా.. శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ మూవీ మాత్రం నిరాశపరిచింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

కార్తీ ప్రస్తుతం 'జపాన్' అనే సినిమా చేస్తుండగా.. శివ కార్తికేయన్ 'మావీరన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరోసారి జవాన్, మావీరన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ కి దిగపోతున్నారు ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు.కాగా ప్రస్తుతానికి దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక కార్తీ నటిస్తున్న జవాన్ సినిమాను రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే జవాన్ నుంచి విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు శివ కార్తికేయన్ నటిస్తున్న మావీరన్ సినిమాని శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ కి జోడిగా అతిథి శంకర్ కథానాయకగా నటిస్తోంది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ మండేలా ఫేమ్ మడోన్నే అశ్విన్ ఈ చిత్రానికి రైటర్ కం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అలాగే సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతమందిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు జూన్ 29న విడుదల కాబోతూ ఉండడంతో మరోసారి కార్తీ, శివ కార్తికేయన్ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలోనే ఈ రెండు చిత్రాల నుంచి మేకర్స్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: