శాండిల్ వుడ్ స్టార్ హీరోలు అయినటు వంటి ఉపేంద్ర ... కిచ్చా సుదీప్ లో తాజాగా కబ్జా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రేయ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి ఆర్ చంద్రు దర్శకత్వం వహించగా ... రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది.

ప్రస్తుతం ఈ మూవీ విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఈ మూవీ యూనిట్ భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కు ఈ మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా యొక్క కొన్ని వారాల ధియేటర్ రన్ ముగిసిన తర్వాత తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఈ మూవీ లో ఇద్దరు శాండిల్ వుడ్ స్టార్ హీరోలు నటించడంతో శాండిల్ వుడ్ లో ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: