రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమా లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ క్రేజీయేస్ట్ ప్రాజెక్ట్ లలో సలార్ మూవీ ఒకటి. ఈ మూవీ లో ప్రభాస్ హీరోcగా నటిస్తూ ఉండగా ... ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై దేశcవ్యాప్తంగా ఇప్పటికే సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.

ఇలా భారీగా అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా అవి ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లో శృతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ... జగపతి బాబు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ భాషలతో పాటు సలార్ మూవీ ని ఇంగ్లీష్ భాషలో కూడా థియేటర్ లలో విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు ఈ మూవీ కి 200 కోట్ల  ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: