ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ బ్యాక్గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన వారసులదే హవా ఎక్కువగా నడుస్తూ ఉంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదండోయ్ అటు బాలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో పెద్ద ఫ్యామిలీల నుంచి చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా ఇలా భారీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వారే అని చెప్పాలి. ఇప్పటికే నందమూరి, ఘట్టమనేని, మెగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బాగా రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుస్తుంది. రవితేజ తన ఫ్యామిలీ నుంచి వారసుడిని పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాడు. మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా టాలీవుడ్కు డెబ్యు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాణి సమర్పణలో ఇక ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక ఇటీవల  రామానాయుడు స్టూడియోస్ లో ఇక ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ కార్యక్రమంలో కే రాఘవేంద్రరావు తో పాటు సురేష్ బాబు, నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శక నిర్మాత అయిన చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్  సంగీతం అందిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రవితేజ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మొదటి వారసుడు కావడంతో ఇక అతన్ని బాగా ఎంకరేజ్ చేసే రవితేజ సినీ వారసత్వాన్ని నిలబెట్టాలని ఫ్యాన్స్ కూడా సిద్ధమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: