
ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ ఏం మాట్లాడినా కూడా అది పెద్ద సమస్యగా మారిపోతుంది అంటూ నాని చెప్పుకొచ్చాడు. గతంలో తాను టికెట్ ధరల విషయంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టి వార్తలు నిలిచాను అన్న విషయాన్ని కూడా వెల్లడించాడు. అంతేకాదు దర్శకుడు సుకుమార్‌ను తక్కువ చేసి మాట్లాడినట్లు వస్తున్న వార్తలపై కూడా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. చిన్న విషయానికే పెద్ద సమస్యల్లో చిక్కుకున్నారా అని యాంకర్ ప్రశ్నించుగా.. ఇక ఈ రెండు విషయాలను కూడా ప్రస్తావించాడు నాని. చిన్న విషయాలే పెద్ద సమస్యలు తీసుకువచ్చయ్. ఆ విషయాల గురించి చెప్తే అది మరొక సమస్యకు దారితీస్తుంది. శ్యాం సింగరాయ్ సమయంలో టికెట్ ధరల గురించి నా అభిప్రాయాన్ని మామూలుగా చెప్పాను. కానీ ఆ తర్వాత అదే పెద్ద సమస్యగా మారిపోయింది.
సుకుమార్ విషయంలో ఇలాంటిదే జరిగింది. అందరూ స్టార్ డైరెక్టర్స్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మీరు ఎందుకు కొత్త దర్శకులతో చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తే.. ఆయా దర్శకులకు మన దగ్గర పాపులారిటీ ఉండొచ్చు.. కానీ బాలీవుడ్‌కు కొత్త వాళ్లే కదా. సుకుమార్ తెలుగులో అగ్ర దర్శకుడు కావచ్చు.. కానీ బాలీవుడ్లో పుష్ప తర్వాతే క్రేజ్ సంపాదించారు. ఇక ఎప్పుడు మా దర్శకుడు కూడా కొత్త వాడు కావచ్చు.. కానీ తర్వాత మంచి పేరు సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది అంటూ మా దర్శకుడికి మద్దతు ఇస్తూ మాట్లాడా. సుకుమార్ ను తక్కువ చేసి మాట్లాడానని దానిని పెద్ద వివాదంగా మార్చారు. కానీ నాకు సుకుమార్ అంటే ఎంతో గౌరవం ఉంది అంటూ నాని చెప్పుకొచ్చాడు.