ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప్రతి ఒక్కరికి సుపరిచితమే ముఖ్యంగా సినీ సెలబ్రిటీల రాజకీయ నాయకుల జీవితాల విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. గతంలో నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారక్త బాగా ఫేమస్ అయిన వేణు స్వామి.. ఆ తర్వాత రష్మిక తో పూజలు చేసి మరొకసారి వైరల్ గా మారారు. ఇక ఆ తర్వాత పలు రాజకీయవేత్తలపైన వారి జాతకాలను చూపుతూ బాగానే పాపులర్ సంపాదించారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి తో పూజలు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.


హీరోయిన్ నిధి అగర్వాల్ మొదట నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. తాజాగా నిధి అగర్వాల్ తో వేణు స్వామి బృందం తన ఇంట్లో పూజలు చేస్తున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ వీడియోలో నిధి అగర్వాల్ పింక్ కలర్ చుడిదార్ ధరించి వేణు స్వామి బృందం చెబుతున్నట్లుగా వేదమంత్రాలు చదువుతూ పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిధి అగర్వాల్ పక్కనే కూర్చున్న వేణు స్వామి ఈ పూజ చేయిస్తూ ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక గతంలో రష్మిక తో కూడా వేణు స్వామి ఇలాంటి పూజలు చేయించారు..అందువల్లే రష్మిక స్టార్ హీరోయిన్గా మారిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా అందుకే ఇలాంటి పూజ నిర్వహిస్తోంది అంటూ వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇది అందుకోసమా లేకపోతే ఏదైనా జాతకంలో దోషమా అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: