సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున తెలుగు భాషలో విడుదల అయింది. ఈ మూవీ ని మొదట పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ని మొదట కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేశారు. 

భారీ అంచనాల నడుమ తెలుగు భాషలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇలా ఇప్పటికే ఈ మూవీ తెలుగు వర్షన్ సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఈ మూవీ ని ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన హిందీ థియేటర్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ దక్కించుకుంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ యొక్క హిందీ థియేటర్ హక్కులను "గోల్డ్ మైన్స్" సంస్థ దక్కించుకుంది. అలాగే ఈ సంస్థ ఈ మూవీ ని హిందీ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

sai