మామూలుగా సెలబ్రెటీల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది. అది బయట కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. నిజానికి అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

కానీ కొందరు కావాలని వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను తప్పు పడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటిదే గెటప్ శీనుకు ఎదురయ్యింది. తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్టుకు గెటప్ శీను స్పందించగా.. వెంటేనే మరో నేటిజన్ ఫైర్ అవుతూ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ కామెంట్ చేశారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్న అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగి మంచి గుర్తింపు అందుకుంది. తన మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ లో తను వేసిన డాన్సులకు మాత్రం కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.అనసూయ ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత వెండితెరపై పలు సైడ్ క్యారెక్టర్లలో నటించింది. అయితే యాంకర్ గా ఈటీవీ జబర్దస్త్ తో బుల్లితెరపై అడుగుపెట్టాక ఇక్కడి నుంచి ఈమె తలరాత మొత్తం మారింది. ఈ షోతో అనసూయ కు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా మంచి అభిమానం కూడా సొంతం చేసుకుంది. ఇందులో తన మాటలతో, డాన్సులతో అందర్నీ ఫిదా చేసింది. ఇక ఈ షో ద్వారానే ఈమెకు వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి. చాలా వరకు మంచి మంచి గుర్తింపు ఉన్న పాత్రలలో నటించింది. అంతేకాకుండా కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా అలరించింది. ఇక జబర్దస్త్ కు దూరమై వెండితెరపై బాగా బిజీగా ఉంది. ఇదే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది అనసూయ. మొత్తానికి అనసూయ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తను ఏంటో నిరూపించుకుంది.

ఇప్పుడైతే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తను నటించిన విమానం సినిమాకి సంబంధించిన పోస్టర్ ను పంచుకుంది. అందులో మేడే శుభాకాంక్షలు అని చెబుతూ ఒక గోడ మీద చీర కట్టుకొని కూర్చున్న తన ఫోటో ఉంది. ఇక అది చూసి ఫ్యాన్స్ అంతా చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే జబర్దస్త్ గెటప్ శీను.. ఆల్ ది వెరీ బెస్ట్ అను అంటూ పంచుకోగా.. వెంటనే ఓ నెటిజన్.. గెటప్ శీను ని ట్యాగ్ చేసి.. పబ్లిక్ ప్లాట్ఫారంలో కామెంట్ చేస్తున్నప్పుడు మర్యాదపరంగా కామెంట్ పెట్టు బ్రో. అనసూయ గారు అని పెట్టు కామెంట్. అను ఏంటి. అను ఏమైనా నీకు స్కూల్ ఫ్రెండా.. కాలేజ్ ఫ్రెండా.. లేక నీకు చుట్టమా.. పబ్లిక్ గా కామెంట్ చేసినప్పుడు గారు అని సంబోధించండి అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది. అయితే అనసూయ మాత్రం గెటప్ శీనుకు థాంక్యూ సీనా స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: