ఈవారం గోపీచంద్ అల్లరి నరేష్ ల మధ్య వార్ జరగబోతోంది. ఈ రెండు మీడియం రేంజ్ సినిమాలను చాల ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. క్రితం వారం విడుదలైన ‘ఏజెంట్’ ఫెయిల్ అవ్వడంతో ఈ రెండు సినిమాలలో ఏసినిమా సమ్మర్ రేస్ లో రాణిస్తుంది అన్నవిషయమై రకరాకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య తన లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు నరేష్ ఈసినిమాకు సంబంధించిన క్లైమాక్స్ కు సంబంధించి లీకులు ఇచ్చాడు.


తనను చాలామంది అల్లరి నరేష్ అని పిలుస్తూ ఉంటారని అలా పిలవడం కంటే ‘నాంది’ రమేష్ అని తనను పిలిస్తే బాగుంటుంది అన్నది తన అభిప్రాయం అంటున్నాడు. ఇక ఈసినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ఈ క్లైమాక్స్ ను 15 రోజుల పాటు సహజత్వం కోసం రాత్రిపూట చిత్రీకరించ వలసి వచ్చిందని చెపుతూ ఈ క్లైమాస్ లో ఒక పవర్ ఫుల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుందని చెపుతున్నాడు.


తాను హాస్య సినిమాలు చేస్తున్నంతసేపు సీరియస్ సినిమాలు ఎప్పుడు చేస్తావు అంటూ అని అడిగిన వారి గురించి ప్రస్తావిస్తూ ఎవరైనా మన దగ్గర ఉన్న దాన్ని గురించి కాకుండా లేని దాన్ని గురించి మాట్లాడటం ఒక హాబీగా పెట్టుకున్నారు అంటూ నరేష్ కొంతమందికి చురకలు అంటించాడు. ఇక ఈమూవీ దర్శకుడు విజయ్ కనకమేడల గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎందరో దర్శకులతో సినిమాలు చేసినా వారెవ్వరు పట్టించుకోని తనలోని లోపాలు తనకు అర్థం అయ్యేలా చెప్పి తనలోని మార్పుకు కారణం అయ్యాడు అని అంటున్నాడు.


వాస్తవానికి ‘ఉగ్రం’ లాంటి సీరియస్ సినిమాలు చేయడం కంటే కామెడీ సినిమాలు చేయడం చాలకష్టం అనీ ప్రేక్షకులను నవ్వించడం అంత సులువుకాదు అంటున్నాడు. తాను తనకు ఇమేజ్ తెచ్చిపెట్టిన కామెడీ మార్క్ సినిమాలలో నటించే అవకాశాలు వదులుకోనని ఒకవైపు సీరియస్ మూవీలు చేస్తూనే మరొకవైపు కామెడీ సినిమాలు చేస్తాను అని అంటున్నాడు ఈ అల్లరోడు..




మరింత సమాచారం తెలుసుకోండి: