తెలుగు సినీ ఇండస్ట్రీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో కన్నడ సినిమా ఇండస్ట్రీకి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అలాగ. కన్నడ అగ్ర నటుడు కంటిరవ రాజకుమార్ చిన్న కొడుకుగా సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు పునీత్ రాజ్ కుమార్.ఆయనని కన్నడ పరిశ్రమలో ప్రేమగా అప్పు అని పిలుస్తారు. వరుస విజయాలను అందుకున్న ఈయన చిత్ర పరిశ్రమలో కోట్లాది అభిమానులు సైతం సొంతం చేసుకున్నాడు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే కర్ణాటక మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు పునీత్ సినిమాలకు వచ్చినంత ఓపెనింగ్ కలెక్షన్స్ కర్ణాటకలో ఏ హీరోకి కూడా రావు.

 ఇక అలాంటి ఒక మంచి మనసున్న హీరో అకస్మాత్తుగా జిమ్ చేస్తూ రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. దాంతో యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఆయన చనిపోయే ముందు రోజు కూడా అన్న శివరాజ్ కుమార్ హీరోగా నటించిన బజరంగీ టు సినిమా రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు ఆయన. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ కుమార్ మరణించాడు. దాంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు కోట్లాదిమంది ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన సినిమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అంతే కాదు ఎందరో అనాధ పిల్లలను చదివిస్తూ ఉంటాడు.

 అనాధలను మరియు వృద్ధులను కూడా దగ్గరికి తీసుకునే మంచి మనసు ఆయనది. ఆయన ఎన్నో అనాధ శరణాలయాలను కూడా కట్టించారు. ఇక అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత కూడా తన నేత్రాలను దానం చేసి ఆయన మంచి మనసును చాటుకున్నాడు. ఇకపోతే ఆయన తెలుగు హీరోలతో కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన రెండు మూడు సార్లు కలిశారు. ఇక అసలు విషయం ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ కోసం మన పవన్ కళ్యాణ్ ఒక గొప్ప పని చేశాడని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే పునీత్ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని ఆయన చనిపోయే వరకు ఎవరికీ తెలియదు. ఇక అందరి లాగానే ఈ విషయాన్ని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పునీత్ రాజ్ కుమార్ నడుపుతున్న స్కూల్ కి తన వంతుగా 30 లక్షలకు పైగానే విరాళం ఇచ్చినట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: