ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తు్న్నాడు. ఇప్పుడు అతడి చేతిలో అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ ఆదిపురుష్‌ 16 జూన్ 2023న విడుదలవుతోంది. సాలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, స్పిరిట్ క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా వరుసగా ఉన్నాయి. ఆదిపురుష్ లో రాముడిగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. అయితే ప్రభాస్ ఒకప్పుడు తన షర్ట్ తీసేసి సినిమాలో నటించేందుకు ఎంతో భయపడిపోయాడు. చొక్కా లేకుండా ఒక సన్నివేశానికి ధైర్యంగా వెళ్లడానికి నిరాకరించాడని కూడా చాలామందికి తెలియదు.

ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ పౌర్ణమి లో నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాలో ఛార్మీ, త్రిషతో ప్రభాస్ రొమాన్స్ చేశాడని తెలుసు.. పౌర్ణమి సినిమాలో ఓ సన్నివేశం కూడా ఉంటుది. ప్రభాస్, త్రిష దగ్గరయ్యే సన్నివేశం ఒకటి ఉంది. ఈ సీన్‌లో ప్రభాస్, త్రిష రొమాన్స్ చేస్తూ.. పైన బట్టలు లేనట్టుగా అయితే కనిపించాలి.

దర్శకుడు ప్రభాస్‌ని షర్ట్‌ తీసేయమని కోరగా, 'లేదు లేదు. నేను సిగ్గుపడుతున్నాను. అలా చేయను. చొక్కా వేసుకుంటాను. ఎడిటింగ్ విషయంలో చూసుకో.' అని కూడా చెప్పాడట. సీన్ తీసి.. ఎడిట్ చేస్తే సహజంగా అనిపించక పోవడంతో దర్శకుడు ప్రభుదేవా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా ప్రభాస్ వినలేదు.

ఈ క్రమంలో మూడు రోజుల పాటు షూటింగ్‌ను కూడా వాయిదా వేశాడు దర్శకుడు. తరువాత కృష్ణంరాజు మనం నటిస్తున్నాం అంతే అని శిక్షణ ఇచ్చి సినిమా షూటింగ్‌ కి పంపారటా.. అప్పుడు కూడా ఈ సీన్ తీసేందుకు ప్రభాస్ నాలుగు గంటల సమయం తీసుకున్నాడటా.. రాధే శ్యామ్‌లో కూడా, పూజా హెగ్డే తో సన్నిహిత సన్నివేశాల సమయంలో ప్రభాస్ చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడటా..

ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ బిజిగా ఉన్నాడు. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా పేరు రాజా డీలక్స్‌గా ప్రచారంలో కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుందని సమాచారం.. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ లో తీరిక లేకుండా గడుపుతున్న డార్లింగ్ మూవీని మే 26 కల్లా పూర్తి చేయనున్నట్లు అయితే సమాచారం. దీంతో ఫ్యాన్స్ సహా ప్రతి ఒక్కరూ కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు. అసలు ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేశారు అంటూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: