నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఆఖరుగా నటించినటువంటి అఖండ , వీర సింహా రెడ్డి మూవీ లు అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకోని ఉన్నాయి.

ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపాందుతుంది. దానితో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఈ మూవీ బృందం "ఎన్ బి కే 108" అనే వర్కింగ్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం రేపు అనగా జూన్ 8 వ తేదీన ఈ మూవీ యొక్క టైటిల్ ను ప్రకటించబోతున్నట్లు అధికారికంగా ఇప్పటికే అనౌన్స్ చేసింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి మూవీ మేకర్స్ "భగవత్ కేసరి" అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసినట్లు ... ఇదే టైటిల్ రేపు అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ టైటిల్ ను బాలకృష్ణ మూవీ కి పెడుతున్నారు అనే వార్త బయటకు రావడంతోనే ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: