ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై యాంకర్ గా హవా నడిపిస్తున్న వారిలో అటు యంగ్ బ్యూటీ శ్రీముఖి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఈటీవీలో ప్రసారమైన పటాస్ అనే కార్యక్రమంలో యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ రావడంతో అక్కడ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలుగా మారిపోయింది. బిగ్బాస్ టైటిల్ కోసం గట్టి పోటీ ఇచ్చి చివరికి రన్నరఫ్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.


 బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది అని చెప్పాలి. అయితే షోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులను ఎప్పుడు తన హాట్ ఫొటోస్ తో అలరిస్తూనే ఉంటుంది  ఈ సొగసరి. అయితే వయస్సు మీద పడుతున్న శ్రీముఖి ఇంకా ఎందుకు పెళ్లి ఊసే ఎత్తడం లేదు అన్నదే గత కొంతకాలం నుంచి బులితెరపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇన్నాళ్లపాటు తాను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని ఇటీవల ఒక షోలో చెప్పింది ఈ యాంకర్. శ్రీముఖి వ్యాఖ్యతగా స్టార్ మా పరివార్ కార్యక్రమం బుల్లితెర  ప్రేక్షకులను అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో విడుదలై  తెగ వైరల్ గా మారిపోయింది. షో మధ్యలో జబర్దస్త్ కమెడియన్ ఫైమా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయం గురించి శ్రీముఖి స్పందించింది. తన షోకి గెస్టులుగా వచ్చిన వారంతా భార్యలతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చూశాం కదా.. పెళ్లయితే ఇన్ని కష్టాలు ఉంటాయని నేను పెళ్లి చేసుకోవట్లేదు అర్థమైందా నీకు అంటూ ఫైమాకు సమాధానం చెప్పింది శ్రీముఖి. నేను నీకు ఇంకా ఎవరూ రావడం లేదేమో అనుకుంటున్నా అంటూ ఫైమా పంచ్ వేయడంతో శ్రీముఖి మొహం మాడి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: