తమిళ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది సంగీత దర్శకులు ఎన్నో తెలుగు సినిమాలకు సంగీతం అందించిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం కూడా ఎంతో మంది తమిళ సంగీత దర్శకులు తెలుగు లో అనేక సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్ కూడా ప్రస్తుతం అనేక తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు తెలుగు లో ఏ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు అనే విషయాలను తెలుసుకుందాం.

టైగర్ నాగేశ్వరరావు : మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఆది కేశవ : ఉప్పెన మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆది కేశవ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

నితిన్ ... వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ మూవీ కి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక మూవీ రూపొందబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కూడా జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: