ఈసారి సమ్మర్ సీజన్ టాప్ హీరోల సందడి లేకపోవడంతో చాల నిశ్శబ్ధంగా నడిచింది. ఇప్పుడు ఆలోటును జూలై ఆగష్టు నెలలు తీర్చబోతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా కేవలం 30 రోజుల గ్యాప్ మధ్య ముగ్గురు మెగా హీరోలు తమ సినిమాలతో ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ ఉండటంతో ఈ మెగా ఫిలిమ్ ఫెస్టివల్ విజేత ఎవరు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా కనిపిస్తోంది.


ఈనెల 28న పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ విడుదల కాబోతోంది. పవన్ దేవుడు గా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ స్క్రిప్ట్ సంభాషణలు అన్నీ త్రివిక్రమ్ వ్రాయడంతో మాటల మాంత్రికుడి మ్యాజిక్ తో ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని పవర్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు.


సినిమా విడుదలైన కేవలం రెండు వారాల గ్యాప్ తో ఇండిపెండెన్స్ డేకి కలిసి వస్తున్న లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ చిరంజీవి మెహర్ రమేష్ ల ‘భోళాశంకర్’ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు స్పందన బాగా రావడంతో ‘వాల్తేర్ వీరయ్య’ ఇచ్చిన జోష్ ను చిరంజీవి కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన రెండు వారాల గ్యాప్ తో వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’ విడుదల కాబోతోంది.


డిఫరెంట్ సినిమాల దర్శకుడుగా పేరుగాంచిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ మూవీ పూర్తి యాక్షన్ మూవీగా నిర్మించారు. ఈమధ్య ఫ్లాప్ లతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ ఈ మూవీతో తిరిగి తనకు అదృష్టం కలిసి వస్తుందని ఆశిస్తున్నాడు. మెగా హీరోలకు సంబంధించిన ఈ మూడు సినిమాల పై 2 వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగే ఆస్కారం ఉంది. దీనితో ఈ మూడు సినిమాలలో ఏసీనిమాకు ప్రేక్షకులు పట్టంకడతారు అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: