ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమా లను రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రీ రిలీజ్ అయిన సినిమా లలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఖుషి సినిమా ఆ సమయం లో ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించగా ... ఎస్ జె సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 7.46 కోట్ల కలెక్షన్ లు లభించాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సినిమాలలో సింహాద్రి సినిమా ఒకటి. ఈ మూవీ లో భూమిక హీరోయిన్ గా నటించగా ... రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో 4కే వర్షన్ తో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 4.60 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది సినిమాను కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 3.52 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇలా ఈ నగరానికి ఏమైంది మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రీ రిలీజ్ అయిన సినిమాలలో టాప్ 3 ప్లేస్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: