తెలుగు ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పటి స్టార్ హీరోలందరి కీ జోడీ గా నటించిన సౌందర్య ఆయా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించడం గమనార్హం. వెంకటేశ్ సౌందర్య జోడీ హిట్ జోడీ కాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. సౌందర్య తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు.సౌందర్య పలు లేడీ ఓరియెంటెడ్ సినిమా లలో నటించ గా ఆ సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రేపు సౌందర్య పుట్టిన రోజు కాగా సౌందర్య ఆశయం ప్రకారం కుటుంబ సభ్యులు అమర సాత్విక సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో ఫౌండేషన్ స్కూల్ ను మొదలుపెట్టగా ఈ స్కూల్ ద్వారా ఆటిజం పిల్లలకు విద్యను అందిస్తున్నారని సమాచారం అందుతోంది.
సౌందర్య లోకాన్ని విడిపిపెట్టి వెళ్లిపోయినా ఫౌండేషన్ ద్వారా చదువుతున్న విద్యార్థుల రూపంలో జీవించి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సౌందర్య తన సినిమాల రూపం లో జీవించి ఉన్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సౌందర్య లాంటి గొప్ప నటి ఈ తరంలో ఎవరూ లేరని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సౌందర్య తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమా లలో నటించి ఆ సినిమాల ద్వారా ప్రశంసలను సొంతం చేసుకోవడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి