త్రిబుల్ ఆర్ అని వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అటు దేవర సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇక ఈ సినిమాలో అటు తారక్ సరసన అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇక ఇదే జాన్వీ కపూర్ కు మొదటి సినిమా కావడం గమనార్హం.


 దేవర సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఏకంగా తారక్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు అంటూ వార్త వచ్చింది. దీంతో ఇక దేవర సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇక దేవర సినిమాలో విలన్ సైఫ్ అలీ ఖాన్ అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఈ బాలీవుడ్ హీరో గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఆయన ఆస్తుల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.



 సైఫ్ అలీ ఖాన్ స్టార్ హీరోగా కొనసాగుతుండగా అతని భార్య కరీనాకపూర్ కూడా బాలీవుడ్ లో స్టార్ కి హీరోయిన్. అయితే సైఫ్ అలీ ఖాన్ తండ్రి ఎవరో కాదు దివంగత ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. వీల్లది నవాబుల వంశం. సైఫ్ తండ్రి  పూర్వికులు నవాబులుగా చెలమని అయ్యేవారు. అయితే మొదట సైఫ్ అలీ ఖాన్ నటి అమృత సింగ్ ను వివాహం చేసుకోగా.. తర్వాత  విడిపోయారు. విరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సంతానం ఉన్నారు. ఇక 2012లో కరీనా కపూర్ ను వివాహం చేసుకోగ.. ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే ఇప్పటికే కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి నటుడిగా నిరూపించుకున్న సైఫ్ అలీ ఖాన్  కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఇక ఆస్తుల  విషయానికి వస్తే ఏకంగా ఈ బాలీవుడ్ హీరో ఆస్తుల విలువ 1300 కోట్లకు పై మాటెనట. ఏడాదికి 30 కోట్ల వరకు సంపాదిస్తాడట. ఇక వ్యాపార ప్రకటన ద్వారా వచ్చే ఆదాయం అదనం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: