
ఇక అప్పట్లో కుర్రాళ్ళ గుండెల్లో ఈ డైలాగ్ గిలిగింతలు పెట్టించింది. ఇంత చెప్పాక ఆ సినిమా ఏదో మీకు గుర్తొచ్చే ఉంటుంది. అవును నాగార్జున గిరిజా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన గీతాంజలి. Ee మూవీలో అమాయకమైన చూపులతో ఆకర్షించే అభినయంతో అప్పట్లో కుర్రాళ్ళ మతి పోగొట్టింది ఈమె. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనే నటించింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఇక సినిమాలకు దూరంగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలోవచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ అయింది అని చెప్పాలి.
అయితే ఈ సినిమా తర్వాత గిరిజా శెట్టిని అందరూ గీతాంజలి అని పిలవడం కూడా మొదలుపెట్టారు. అయితే ఇక ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు గిరిజ. పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వెండితెరపై వెలిగేందుకు రెడీ అవుతుందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే గిరిజ తన కెరీర్ మొత్తంలో కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే ఇప్పుడు ఏకంగా గిరిజకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. ఇవి చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు ఎంతో క్యూట్ గా కనిపించిన గిరిజ ఇలా మారిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ గీతాంజలి హీరోయిన్.