జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ నాగబాబు నివాసంలో జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు.ఐదేళ్లకు పైగా వరుణ్, లావణ్య డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. దాంతో ఎక్కడో ఓ మూలన సందేహాలు ఏర్పడ్డాయి.నవంబర్ నెలలో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ వివాహం అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. లావణ్య యాక్టింగ్ కి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి