మొన్నటి వరకు సినిమాలు చేయడం విషయంలో చాలా గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్.. ఇక ఇప్పుడు మాత్రం తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాద్షా అని తనను ప్రేక్షకులు ఎందుకు అంటారు అన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న షారుఖ్ ఖాన్ సినిమాలకు తిరుగులేకుండా పోతుంది అని చెప్పాలి. ఇక నిర్మాతలకు లాభాల పంట పండుతుంది. మొన్నటికీ మొన్న పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న షారుక్ ఖాన్  ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాలలో అయితే ఏకంగా షారుఖాన్ కూడా డామినేట్ చేశాడు విజయ్ సేతుపతి.


 బాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా జవాన్ రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిజినెస్ మాన్, వెపన్స్ డీలర్ కాలి గైక్వాడ్ పాత్రను పోషించాడు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకోలేదట. ఇక ఈ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ హీరోని సంప్రదించారట. ఆ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. స్టోరీ చెప్పగానే నాని కూడా ఓకే చెప్పేసాడట. ఆ తర్వాత డైరెక్టర్ అట్లీ లుక్ టెస్ట్ చేయగా ఓల్డ్ ఏజ్ లో నాని సెట్ అవ్వడం లేదని.. ఇక అట్లీకి అనిపించింది. ఇదే విషయాన్ని నాని కి చెప్పగా ఫీల్ అవ్వకుండా సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ తర్వాత ఈ రోల్ విజయ్ సేతుపతికి దక్కిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: