మొన్నటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ అనే సినిమాతో ఒక సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇక అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేసింది. అయితే ఇక జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ఎంతటి సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే లాభాల్లో మునిగి తేలిన నిర్మాత కళానితీ మారన్ హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ లకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చాడు అని చెప్పాలి.


 ఇక ఈ సినిమా మొత్తంగా 600 కోట్ల వరకు వసూలు సాధించింది. సాటిలైట్ రైట్స్, ఓటిటి రైట్స్ అన్నీ కలుపుకొని ఇక 1000 కోట్ల వరకు వచ్చాయి అని చెప్పాలి  అయితే సినిమాలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోకి కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత అటు విలన్ గా నటించిన వ్యక్తిని మాత్రం పట్టించుకోలేదు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన వినాయగన్ ఎంతో అద్భుతంగా తన పాత్రకు న్యాయం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇక ఆయన కాకపోయి ఉంటే ఆ పాత్రను అంతలా ఎవరు బాగా పోషించేవారు కాదేమో అనేంతలా ప్రభావితం చేశారు. అయితే ఇలా జైలర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన వినయగన్ ఎంత పారితోషకం తీసుకున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే ఇలా విలన్ పాత్రలో నటించిన వినయగన్ కేవలం 35 లక్షల రూపాయల పారితోషకు మాత్రమే తీసుకున్నారంటు ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.  నిర్మాతలు ఈ వార్త వినకపోతే చాలు. నాకు 30 లక్షలు ఇచ్చారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు  తప్పుడు వార్తలను కొంతమంది ప్రచారం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాతలు నేను అడిగినంత ఇచ్చారు. సెట్ లో నాకు రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటూ వినాయగన్  చెప్పుకొచ్చాడు. జైలర్ సినిమా అనేది నాకు పెద్ద అవకాశం. ఈ అవకాశం  వచ్చినందుకే నేను సంతోషిస్తున్నాను. జైలర్ సినిమా వల్ల ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్లో అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: