తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో కార్తికేయ ఒకరు. ఈయన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడం ఈ సినిమాలో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో కార్తికేయ కు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఆయన ఆ తర్వాత అనేక సినిమాలలో నటించిన మధ్యలో గుణ 369 మూవీ కాస్త పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇకపోతే ఈ నటుడు ఆ మూవీ ల తర్వాత నాని హీరోగా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ , అజిత్ హీరోగా రూపొందిన తమిళ సినిమా వలిమై లో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు బెదురులంక 2012 అనే సినిమాలో హీరోగా నటించాడు. క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపొతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ నటుడుకి కూడా ఈ సినిమా చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: