రాఘవ లారెన్స్ కొంత కాలం క్రితమే రుద్రుడు అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇలా రుద్రుడు మూవీ తో ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసిన ఈ నటుడు తాజాగా చంద్రముఖి 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ మూవీ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నయన తార హీరోయిన్ గా ప్రభు , జ్యోతిక కీలక పాత్రలలో పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి సినిమాకు కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో చంద్రముఖి 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ కి కూడా పి వాసు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు  ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కంగనా రనోత్ కీలక పాత్రలో నటించగా ... లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీ ... వేదికను ఖరారు చేస్తూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 24 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ ఫిలిం నగర్ ,  హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూవీ బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: