
ఇక ఇప్పటివరకు ఇలాంటివి ఎన్నో సినిమాల విషయంలో జరిగాయ్. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి చర్చ ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది అని చెప్పాలి. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకకుతున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పటికే వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న విజయ్ ఇక ఇప్పుడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమా తమిళం తో పాటు కన్నడ, మలయాళ హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.
అయితే ఇక ఇప్పుడు లియో సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని సూపర్ హిట్ అయినా కార్తిక దీపం సీరియల్ నుంచి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల లియో హిందీ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో దళపతి విజయ్ విలన్ పీక పట్టుకొని కనిపిస్తాడు. అయితే ఈ సీన్ అచ్చంగా కార్తీకదీపం లో వంటలక్క మోనిత పీక పట్టుకున్నట్లుగానే ఉంది అంటూ అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా పోస్టర్ను కార్తీకదీపం లోని సీన్ పోస్టర్ను ఒకచోట చేర్చి మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు.