తమిళ , తెలుగు సినీ పరిశ్రమలలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కొరియో గ్రాఫర్ , డైరెక్టర్ , నటుడు అయినటువంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితమే తమిళ్ లో రూపొందినటువంటి రుద్రన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఇకపోతే ఇదే సినిమాను తెలుగు లో రుద్రుడు పేరుతో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా రాఘవ లారెన్స్ "చంద్రముఖి 2" అనే సినిమాలో హీరోగా నటించాడు. పి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కంగనా రనౌత్  ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో రాఘవ లారెన్స్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: