టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్ అనే మూవీ లో హీరో గా నటించాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ను రేపు అనగా అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో చాలా రోజుల నుండి ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ బృందం వారు నాలుగు పాటలను విడుదల చేశారు . వాటికి ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది . ఇక పోతే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు కూడా పాటను విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ రోజు అనగా అక్టోబర్ 5 వ తేదీన ఈ మూవీ లోని ఐదవ సాంగ్ అయినటువంటి "ఏమైంది రా మామ" అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నారు. 

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం వారు తాజాగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కిరణ్ ఆఖరుగా నటించడం మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర  ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మరి రూల్స్ రంజన్ మూవీ తో ఈ నటుడు మంచి విజయాన్ని అందుకుంటాడో లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: