ఎన్నికల నగారా మ్రోగడంతో తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారంతో హోరెత్తబోతోంది. అయితే ఈ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతూ ఉండటంతో పాటు డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు బయటకు రాబోతున్న నేపధ్యంలో ఈప్రకటన టాలీవుడ్ ఇండస్ట్రీకి తలనొప్పులు తగ్గించింది అన్న వార్తలు వస్తున్నాయి. నవంబర్ లో చెప్పుకోతగ్గ స్థాయిలో సినిమాల విడుదల ఉండకపోవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి.



దీనికితోడు నవంబర్ లో వచ్చే దీపావళి పండుగ తెలుగు ప్రజలకు అమావస్య సెంటిమెంట్ తో కూడుకున్న పండుగ. అందువల్ల దీపావళిని టార్గెట్ చేస్తూ భారీ సినిమాలు విడుదల కావు. దీనితో నవంబర్ మూడవ వారం నాల్గవ వారం కేవలం చిన్న సినిమాల మధ్య మాత్రమే పోటీ జరిగే ఆస్కారం కనిపిస్తోంది.



ఇలాంటి పరిస్థితులలో ఎన్నికలు ముగిసి ప్రశాంతమైన వాతావరణం డిసెంబర్ రెండవ వారం నుండి మాత్రమే మళ్ళీ భారీ సినిమాల హడావీడి మొదలవుతుంది. దీనితో ఎన్నికలు జరిగే నవంబర్ చివరి వారం తెలుగు సినిమాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే సందీప్ వంగా రణబీర్ కపూర్ ల ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1 రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నప్పటికీ ఆరోజుకు తెలంగాణ ఎన్నికలు పూర్తి అవుతాయి కాబట్టి ఆ సినిమాకు కూడ ఎటువంటి సమస్య ఉండదు.



ఇది ఇలా ఉంటే త్వరలో జరగబోతున్న తెలంగాణ ఎన్నికలలో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ ప్రముఖలు కొందరు పోటీ చేసే ఆస్కారం కనిపిస్తోంది అని టాక్. ఈ లిస్టులో దిల్ రాజ్ బండ్ల గణేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు పవన్ కళ్యాణ్ ప్రచారం తెలంగాణ రాష్ట్రంలో ‘జనసేన’ కు ఎన్ని ఓట్లు తెచ్చి పెడుతుంది అన్న ఆశక్తి కూడ చాలమందిలో ఉంది. ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈసారి తెలంగాణ ప్రాంతంలో చాల ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంది అన్న సంకేతాలు కూడ ఉన్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: