తలపతి విజయ్ తాజాగా లియో అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. మరి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు భారీ కలెక్షన్ లు వచ్చాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు మొదటి రోజు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 3.46 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.58 కోట్లు , యుఏ లో 91 లక్షలు , ఈస్ట్ లో 62 లక్షలు , వేస్ట్ లో 28 లక్షలు , గుంటూరు లో 67 లక్షలు , కృష్ణ లో 44 లక్షలు , నెల్లూరు లో 35 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.31 కోట్ల షేర్ , 15.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 8.69 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: