పవన్ కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా ఎప్పుడూ హీరో నితిన్ అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై తన అభిమానాన్ని ఏదో విధంగా వ్యక్త పరిచే సీన్ తన సినిమాలలో పెట్టడం ఒక అలవాటుగా మారింది. మొదట్లో పవన్ ఫ్యాన్స్ కూడ ఇలాంటి సీన్స్ రాగానే బాగా జోష్ లోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ప్రతి సినిమాలోను నితిన్ ఇది రిపీట్ చేస్తూ ఉండటంతో పవన్ ఫ్యాన్స్ లో కూడ అలాంటి సీన్స్ పై ఆశక్తి తగ్గింది అన్న ప్రచారం కూడ ఉంది.


అయితే నితిన్ మాత్రం పవన్ ఫ్యాన్స్ అభిమానాన్ని పొందడానికి అవకాశం చిక్కినప్పుడల్లా తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ఎక్స్ ట్రార్డనరీ మూవీలో కూడ నితిన్ పవన్ భజన ఉంటుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించి విడుదల అయిన ఒక స్టీల్ లో నితిన్ గతంలో పవన్ ‘తమ్ముడు’ సినిమాలో వేసుకున్న రైల్వే కూలి గెటప్ ను ఇప్పుడు మళ్ళీ తన సినిమాలో రిపీట్ చేస్తూ ఒక సీన్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


దీనికి సంబంధించిన ఒక స్టీల్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ స్టీల్ పవన్ అభిమానుల మధ్య ట్రెండింగ్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ కూడ నితిన్ వేసుకున్న ఎర్ర కలర్ రైల్వే కూలీ గెటప్ ను లైక్ చేస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ నితిన్ లేటెస్ట్ మూవీని కనీసం ఒక్కసారి చూసినా ఆమూవీ టాక్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా 100 కోట్ల సినిమాగా మారే ఆస్కారం ఉంది.


ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా నితిన్ షేర్ చేసిన రైల్వే కూలి గెటప్ బాగున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలోని అనేకమంది ఈమూవీలో కొత్తదనం లేకుంటే కేవలం నితిన్ చేసే పవన్ కళ్యాణ్ భజనకు ఎంతవరకు సగటు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారే అవాకాశం ..



మరింత సమాచారం తెలుసుకోండి: