గత కొన్ని సంవత్సరాలుగా టాప్ సీనియర్ హీరోల సినిమాలకు వరసగా హ్యాట్రిక్ విజయాలు వచ్చిన సందర్బాలు లేవు. అయితే బాలయ్య భారీ అంచనాలు పెట్టుకున్న ‘భగవంత్ కేసరి’ మొదటివారం నుండి రెండవ వారం వరకు కలక్షన్స్ బాగా ఉండటంతో పాటు మొదటిరోజు ఈమూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ ను తట్టుకుని ఇప్పటివరకు 65 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేయడంతో ఈమూవీ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కేవలం మరో 4కోట్లు వసూలు చేస్తే చాలు ఈమూవీ బయ్యర్లు లాభాల బాట పడతారు అని అంటున్నారు. ఈవారం కూడ ఎలాంటి పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో ఈవారం అంతా బాక్స్ ఆఫీసు దగ్గర ‘భగవంత్ కేసరి’ హవా కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ మ్యానియను మారింత పెంచడానికి ఏర్పాటు చేసిన బస్సు యాత్రలో బాలకృష్ణ కాజల్ లు వ్యక్తిగత కారణల రీత్యా కనిపించకపోయినా అనీల్ రావిపూడి శ్రీలీల లు ఈమూవీని ప్రమోట్ చేస్తూ ప్రతి ఊరు తిరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున లు నటించిన సినిమాలు వరసగా హిట్ అయిన సందర్భాలు లేవు. అయితే దీనికి భిన్నంగా బాలయ్య నటించిన ‘అఖండ’ ‘వీరసింహా రెడ్డి’ ‘భగవంత్ కేసరి’ వరస హిట్లు సాధించడంతో సీనియర్ హీరోలకు దక్కని రికార్డ్ బాలయ్యా సొంతం అయింది అంటూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి