తమిళ నటుడు కార్తీ హీరోగా అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా రాజు మురుగన్ దర్శకత్వంలో తాజాగా జపాన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పెద్ద అంచనాల నడుమ నవంబర్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు మాత్రం వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్ లను రాబట్టింది. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 2.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు కర్ణాటక ఏరియాలో 55 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 20 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు ఓవర్ సిస్ లో 1.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 3.70 కోట్ల షేర్ ... 7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల బారి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 37.30 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ కి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: