తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యనే టాలీవుడ్లో తన హవా తగ్గిపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏ ఒక్క అవకాశం కూడా రాలేదు. రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ హైప్ కావడానికి ముఖ్య కారణం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా అని చెప్పవచ్చు.ఈ సినిమా అందించిన సక్సెస్ తో బిజీ హీరోయిన్గా మారిపోయింది.


స్టార్ హీరోలతో అవకాశం అందుకొనేలా చేసింది. అక్కడి నుంచి ఈమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సినిమా గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది రకుల్ ప్రీతిసింగ్ .తన సినీ కెరియర్లో ఈ సినిమా చాలా ప్రత్యేకమని ఈ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని తెలియజేయడం జరిగింది. ఇలాంటి సినిమాలు తనకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ప్రేమాభిమానాలు చూపించినందుకు తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అంటూ కూడా తెలియజేసింది. మొదట కెరటం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమా తమిళం నుంచి తెలుగులోకి తెరకెక్కించారు ఆ రకంగా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తన మొదటి సినిమా కంటె వెంకటాద్రి ఎక్స్ప్రెస్  సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది. అయితే మొదటిసారి పరిచయమైంది మాత్రం కన్నడ చిత్రం గిల్. ఈ సినిమా శాండిల్ వుడ్ లో ఇప్పటివరకు నటించిన మొదటి చిత్రం చివరి చిత్రం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇతర భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: