బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన ... రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించగా ... సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. 

ఇకపోతే రబ్బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించడం ... సందీప్ ఈ మూవీ.కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో రన్బీర్ నటనకి గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి మంచి టాక్ లభించడంతో ఈ సినిమాకి మరికొన్ని రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ల లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: