శ్రీలీల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఈ ముద్దుగుమ్మ దర్శకెంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు పదికి పైగా సినిమాలలో అవకాశాలను సంపాదించుకుంది. సినిమా తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి మరో హిట్ సినిమాను తన కథలు వేసుకుంది. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో నటించి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదారు సినిమాలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాణిస్తోంది.ఇది ఎలా ఉంటే శ్రీ లీల మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు సినిమా కోసం శ్రీ లీల ఎవరు చేయని త్యాగం చేస్తోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అదేమిటంటే.. శ్రీలీల నవంబర్, డిసెంబర్ నెలలను తన చదువు కోసం కేటాయించిందట.

ఈ నెలలో తనకు పరీక్షలు ఉంటాయని ఇప్పటికే తన టీమ్‌కు, మేనేజర్‌కు చెప్పి ఆమె సెలవుల్నీ తీసుకోవాలనీ నిర్ణయం తీసుకుందట. అయితే తాను నటిస్తోన్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదల ఉండడంతో ఆ సెలవుల్నీ క్యాన్సల్ చేసుకొని షూటింగ్‌కు హాజరు అవుతోందట.  ఇక తన MBBS పరీక్షల్నీ వచ్చే సంవత్సరం వాయిదా వేసిందట. ఇది ఇలా ఉంటే శ్రీ లీల ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: