తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తరువాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు ఎఫ్ 3 తాజాగా భగవంత్ కేసరి మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇలా వరుసగా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విజయాలను సాధిస్తూ పోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇకపోతే తాజాగా భగవంత్ కేసరి మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవి తో చేయబోతున్నట్లు ఈ మూవీవ్ని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథ కూడా లాక్ అయినట్టు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే అనిల్ చెప్పిన కథ చిరంజీవి కి అద్భుతంగా నచ్చినట్లు ... ఆ మూవీ కూడా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి చిరంజీవి ఎక్కువ డేట్ లను ఇవ్వడంతో ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాతే అనిల్ సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో అనిల్ ఆ గ్యాప్ లో మాస్ మహారాజా రవితేజ.తో మూవీ చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలోనే రవితేజ ... అనిల్ కాంబినేషన్ లో రాజా ది గ్రేట్ అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: