
అందుకే ఈ ఇద్దరి దర్శకులు కూడా సౌత్ ఇండియా నుంచి వెళ్లి ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేశారు. జవాన్ సినిమాతో అట్లీ షారుక్ ఖాన్ తో సినిమా తీసి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టగా, అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లోకి వెళ్లి కబీర్ సింగ్ అనే సినిమాను తీసి ఆ తర్వాత ఇప్పుడు ఆనిమల్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప డైరెక్టర్ అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తను రాసుకున్న కథను వైలెంట్ గా చూపించి ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతుంటే అట్లీ మాత్రం తన అన్ని సినిమాలను కమర్షియల్ గానే సక్సెస్ చేసుకుంటూ వెళుతున్నాడు. తను తీసిన రాజా రాణి సినిమా నుంచి నేటి జవాన్ వరకు అట్లీ అన్నీ కమర్షియల్ సినిమాలు తీసి విజయాలు దక్కించుకున్నాడు. కానీ సందీప్ రెడ్డివంగా తీసిన మూడు సినిమాలు కూడా వయిలెన్స్ చిత్రాలు కావడం విశేషం.
వీరి ఇద్దరి స్టైల్ వేరు తీసే పద్ధతి వేరు ఎంచుకుంటున్న కథలు కూడా వేరు అందుకే ఇద్దరినీ ఒకరితో ఒకరు పోల్చడం కష్టం. కానీ సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకోవడం మాత్రం మన సౌత్ ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమని చెప్పాలి. ఇక ముందు ముందు కూడా వీరు మంచి కథలతో బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా గొప్ప సినిమాలు తీయాలని అందరూ కోరుకుంటున్నారు.