వైజాగ్ అమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ జ్ఞానేశ్వరి ఇటీవల ఈమె నటించిన మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అలాగే నాగచైతన్యతో నటించిన దూత అనే వెబ్ సిరీస్ తో కూడా మరింత క్రేజ్ అందుకోవడం జరిగింది. ఈ రెండిటిలో ఈమె అద్భుతమైన నటనని కనబరిచి అందరిని ఆకట్టుకోవడం జరిగింది. మంత్ ఆఫ్ మధు సినిమాలో స్వాతి కంటే మరింత ఎక్కువ క్రేజీని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లో ఈమెకు మరిన్ని అవకాశాలు వెలుపడతాయని చెప్పవచ్చు.


తెలుగు అమ్మాయి కావడం వల్ల స్టార్స్ నుంచి కూడా ఈమెకు అవకాశాలు వస్తాయా లేవా అనే విషయంపై కాస్త అనుమానంగానే ఉంది. ఈ విషయం పక్కన పెడితే దూత వెబ్ సిరీస్ లో యూట్యూబర్ గా మంచి పాపులారిటీ అందుకున్న ఈమె నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జ్ఞానేశ్వరి మాట్లాడుతూ తనకు రామ్ చరణ్ పైన ఉన్న అభిమానాన్ని సైతం చాటుకోవడం జరిగింది. రామ్ చరణ్ పైన ఉన్న అభిమానంతో చాలా కాలం నుంచి ఒక ఫోటోను తాను తయారు చేసుకుంటున్నట్లుగా తెలియజేసింది.


బుక్స్ నిండా రామ్ చరణ్ ఫోటోలు ఉంటాయని చరణ్ ఇప్పుడు కలిస్తే ఏం అడుగుతారు అంటూ ప్రశ్నించగా పదేళ్ల క్రితం చరణ్ ని కలిసి ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని అడిగేదాన్ని ఇప్పుడు మాత్రం ఆయనతో కలిసి నటించాలని అడుగుతానంటూ ఫన్నీగా సమాధానాన్ని తెలియజేసింది జ్ఞానేశ్వరి. మరి జ్ఞానేశ్వరి రామ్ చరణ్ సినిమాలు నటించే అవకాశాన్ని సైతం కల్పిస్తారు లేదో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాట్లాడిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. ఏది ఏమైనా తన నటనతో మెప్పించిన జ్ఞానేశ్వరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలలో నటిస్తుందా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: