స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉండగా బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబీ కాంబో మూవీ లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.అయితే ఈ సినిమా లో చాందిని చౌదరి కూడా కీలక పాత్ర లో నటించనున్నారని సమాచారం అందుతోంది. చాందిని చౌదరి ఇప్పటికే పలు సినిమాలలో నటించినా ఆ సినిమా లేవీ పెద్దగా సక్సెస్ సాధించలేదు.కలర్ ఫోటో మూవీ మాత్రమే  చాందిని చౌదరికి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో చాందిని చౌదరి జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది. బాలయ్య సినిమా తో ఆ హీరోయిన్ దశ తిరగడం ఖాయమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 130 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.బాలయ్య బాబీ కాంబో మూవీ లో యాక్షన్ సీన్లు సైతం స్పెషల్ గా ఉండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యసినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. బాలయ్య పారితోషికం కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.బాలయ్య బాబీ కాంబో మూవీ రిలీజైన తర్వాత బాలయ్య బోయపాటి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. బాలయ్య బోయపాటి కాంబో మూవీ అఖండ సీక్వెల్ కావడం తో ఈ సినిమా కూడా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: