ఇక ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే డైరెక్టర్ ఈ చిత్రానికి ముందుగా హీరోయిన్ గా అనుకుంది శృతిహాసన్ ని కాదట. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ వైపు పరుగులు తీస్తున్న సలార్ సినిమాని మిస్ చేసుకుని బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. మరెవరో కాదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.
రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ కి ఈ మధ్యనే నేషనల్ అవార్డు వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిన విషయమే. ఇక బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిన ఆలియాభట్ మన తెలుగు ప్రేక్షకులకు ఆర్.ఆర్.ఆర్ అలానే బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించి మెప్పించింది. ఇక మొదటి సలార్ మూవీ కోసం ఈ అందాల భామను అనుకున్నారట మేకర్స్. ఇదే విషయాన్ని స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి మరి ప్రశాంత్ నీల్ అడిగారని టాక్.కానీ ఆలియాభట్ ఎందుకు ఈ సినిమాలో నటించడానికి సముఖత చూపలేదు అని తెలుస్తుంది. తన డేట్స్ కుదరకపోవడం కారణమా.. లేదా ప్రభాస్ గత చిత్రాలు ఫ్లాప్ అవ్వడం కారణమా తెలియదు కానీ.. మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మాత్రం ఆలియా మిస్ చేసుకుంది. దీంతో శృతిహాసన్ ఈ మూవీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి