రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ఈ జనవరిలోనే ప్రేక్షకుల ముందు రావాల్సి ఉంది.అయితే ఈ  చిత్రం మళ్లీ వాయిదా పడింది. ఈ ఆలస్యం వెనుక కారణం ప్రభాస్ అనే తెలుస్తోంది. గత నెలలో విడుదలైన ఈ సినిమా 'సలార్‌'కు రిలీజ్ డేట్ దగ్గరగా ఉండటంపై ప్రభాస్  ఆందోళనను వ్యక్తం చేసినట్లు సమాచారం తెలుస్తుంది. నిర్మాతలు ఇప్పుడు మే 9 వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది.నిజానికి 'కల్కి 2898 AD' సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందిన కారణంగా నిర్మాతలు ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం.ప్రభాస్ పాన్-ఇండియా సినిమా 'ఆదిపురుష్' కూడా భారీ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా చాలా ఘోరంగా విఫలమైంది.


అందువల్ల ఇది బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఆడి వసూళ్లు రాబట్టలేకపోయింది. సలార్ కూడా అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టలేక 700 కోట్ల వద్ద ఆగిపోయింది.ఇక బాహుబలి 2 తరువాత 1000 కోట్ల సినిమా కోసం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.సాహో నుంచి రాధే సలార్ దాకా వచ్చిన అన్ని సినిమాలు కూడా 1000 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయాయి. సలార్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా కానీ 1000 కోట్లు మాత్రం వసూలు చేయలేకపోయింది. ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ అందరు కూడా కల్కి సినిమా పైనే 1000 కోట్ల ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గ్లింప్స్ చూస్తే హాలీవుడ్ లెవెల్ లో ఉంది. ఇక సినిమా కూడా ఆ రేంజ్ లో వసూళ్లు నమోదు చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకి పోటీగా గేమ్ చేంజర్, దేవర, పుష్ప 2 వంటి పాన్ ఇండియా సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్నాయి.పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: