తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆఖరుగా ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరో గా నటించిన గ్లోబల్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

 ఇకపోతే ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమాలోని గ్లిమ్స్ వీడియోని విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ యొక్క నైజాం హక్కుల కోసం ఓ ప్రముఖ సంస్థ భారీ ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... దేవర మూవీ యొక్క నైజాం హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎక్కువ ధర అయిన సరే ఈ మూవీ యొక్క నైజాం హక్కులను దక్కించుకోవడానికి మైత్రి సంస్థ ప్రస్తుత ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే దేవర సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: