ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా కథ విషయం లో బేధాభిప్రాయాలు రావడం తో ఆ సినిమా ను వద్దనుకున్నారు. త్రివిక్రమ్ సినిమా ను ఎన్టీఆర్ రిజెక్ట్ చేయగా త్రివిక్రమ్ తర్వాత సినిమా గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందు కోలేదు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే ఆ డైరెక్టర్ తర్వాత సినిమా ఫ్లాపేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ మధ్య కాలం లో ఫ్లాప్ డైరెక్టర్ల కు ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండగా ఆ డైరెక్టర్లు ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టు కుంటున్నారు.కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి