అయితే కొన్ని కొన్ని ఇలా మిస్సయిన క్రేజీ కాంబోస్ కి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక రీసెంట్ గా ఇందుకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఊహించని క్రేజీ కాంబో ఏదైనా ఉంది అంటే అది సమంత- బాలయ్య కాంబినేషన్ అనడంలో సందేహం లేదు. ఇక ఇద్దరు కూడా ఎవరికి వారు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉందట. కానీ చివరికి క్యాన్సల్ అయిందట.
ఆ సినిమా మరేదో కాదు వీర సింహారెడ్డి. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కోసం ముందుగా సమంత ను తీసుకోవాలని అనుకున్నాడట డైరెక్టర్ గోపీచంద్. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ ని అప్రోచ్ కూడా అయ్యాడట. ఇందులో సమంత సాయి పల్లవి కృతి శెట్టి లాంటి స్టార్ హీరోయిన్స్ ఉంటే బాగుంటుందని అనుకున్నాడట. కానీ ఈ హీరోయిన్స్ ఎవరు కూడా ఆ పాత్ర చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. చివరికి వైవిద్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడే వరలక్ష్మి శరత్ కుమార్ ను సంప్రదిస్తే ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందట. కాగా వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మీ పాత్రకి ఎంత స్కోప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి